Header Banner

ప్రజాస్వామ్య విలువలను వక్రీకరిస్తున్న జగన్! స్పీకర్ రూలింగ్‌తో జగన్‌కు షాక్!

  Thu Mar 06, 2025 10:17        Politics

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇచ్చిన కీలక రూలింగ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా ప్రతిపక్ష హోదా గురించి వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న వైఖరి నవ్వులపాలవుతోంది. ప్రతిపక్ష హోదా కోసం తగిన సంఖ్యలో సభ్యులు అవసరం లేదని ఆయన చేస్తున్న వాదనలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. గతంలో తనే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కల్పించానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంధి ప్రేలాపనలా మారాయి. దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తేల్చిచెప్పడంతో జగన్‌కు మైండ్ బ్లాంక్ అయినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

జూన్ 24, 2024న రాసిన లేఖను స్పీకర్ బయటపెట్టడంతో జగన్ వాదనలు మరింత బలహీనపడ్డాయి. అసెంబ్లీలో సరైన సంఖ్యలో సభ్యులు లేకపోయినా ప్రతిపక్ష హోదా దక్కుతుందని ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇది ఒక్కటే కాదు, బడ్జెట్ పై జగన్ చేసిన విమర్శలు కూడా పాత, పాచిపోయిన ఆరోపణలుగా మిగిలిపోయాయి. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అవే పునరావృతమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

మరోవైపు, జనసేనాని పవన్ కళ్యాణ్‌పై జగన్ వ్యంగ్య వ్యాఖ్యలు కూడా ఆయనకే పెను నష్టాన్ని కలిగిస్తున్నాయి. కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ చేసిన విమర్శలు జగన్‌కు ప్రతికూలంగా మారాయి. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన నేతగా ఆయన మరింత దిగజారిపోతున్నారనే అభిప్రాయం బలపడుతోంది. గతంలో అచ్చొచ్చిన అబద్ధాలను ఇప్పటికీ కొనసాగించేందుకు జగన్ ప్రయత్నిస్తుండడం, మార్పుకు అవకాశం లేకుండా తనే తనను మూలుగుతున్నట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే, ఆయన మాటలు తక్కువ, అయోమయం ఎక్కువ అన్నట్టుగా ఉంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #JaganFails #YSJaganExposed #PoliticalDrama #AndhraPolitics #OppositionMockery #AssemblyChaos #TDPVsYSRCP #JaganLies #PawanVsJagan #APPolitics